Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మై నేమ్ రింగ్ టోన్ మేకర్' పేరుతో సరికొత్త యాప్

పేర్లతో కూడా రింగ్ టోన్ పెట్టుకోవాలనుకునే వారికి ఓ సరికొత్త యాప్ వచ్చేసింది. 'మై నేమ్ రింగ్ టోన్ మేకర్' పేరుతో ఉన్న ఈ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 2.3 ఆ పైన వెర్షన్ కలిగిన వినియోగదారులు ప్రస్తుతం ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తాము లేదా తమకు నచ్చిన ఎవరి పేర్లనైనా రింగ్ టోన్లుగా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారులు డివైస్ లో యాప్ ఇన్ స్టాల్ చేసుకున్నాక తాము రింగ్ టోన్ కావాలనుకున్న పేరును అందులో ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన పేరును యాప్ లో పొందుపరిచిన అనేక రకాల పురుషుల, మహిళల గొంతు ద్వారా విని దాన్ని రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చన్నమాట.

More Telugu News