హైదరాబాద్ లో స్టార్టప్ ల వేదిక టి.హబ్ ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లో స్టార్టప్ ల వేదిక టి.హబ్ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టి.హబ్ ప్రారంభమైంది. హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన సువిశాల భవనాన్ని గవర్నర్ నరసింహన్, తెలంగాణ మంత్రి కేటీఆర్, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కలసి ప్రారంభించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో రూ.40 కోట్ల వ్యయంతో దానిని నిర్మించారు. తరువాత టి.హబ్ ప్రాంగణాన్ని గవర్నర్ తో కలసి రతన్ టాటా పరిశీలించారు. 200 స్టార్టప్ లకు చెందిన 800 మందికి ఇందులో అవకాశం కల్పిస్తారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, రోబోటిక్స్, మొబైల్, డేటా ఆనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అనేక రంగాల్లో వినూత్న ఉత్పత్తుల అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి టి.హబ్ కేంద్రం కానుంది.

More Telugu News