ముంబై తీరంలో కూలిన హెలికాప్టర్... ఇద్దరు పైలట్ల గల్లంతు
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నిన్న ఘోర ప్రమాదం సంభవించింది. ఏవియేషన్ లో శిక్షణ పొందుతున్న ఇద్దరు పైలట్లు నైట్ ల్యాండింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో పెద్ద ప్రమాదమే చోటుచేసుకుంది. ఇద్దరు పైలట్లు ట్రైనింగ్ కోసం వినియోగిస్తున్న పవన్ హన్స్ హెలికాప్టర్ ముంబై తీరంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు గల్లంతయ్యారు.
తీరంలోని ఓఎన్జీసీ రిగ్ పై నుంచి గగనతలంలోకి లేచిన హెలికాప్టర్ నిమిషాల వ్యవధిలోనే అరేబియా సముద్రంలో కూలిపోయింది. వెనువెంటనే రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్, భారత నౌకాదళ సిబ్బంది గల్లంతైన పైలట్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే నేటి ఉదయానికి కూడా పైలట్ల జాడ తెలియరాలేదు.