మోదీకి మద్దతుగా బాలీవుడ్ ర్యాలీ: కిరణ్ ఖేర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీకి మద్దతుగా బాలీవుడ్ ర్యాలీ: కిరణ్ ఖేర్

బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఆధ్వర్యంలో పలువురు బాలీవుడ్ నటులు, అభిమానులు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ నిర్వహించనున్నారని బీజేపీ ఎంపీ, సినీ నటి కిరణ్ ఖేర్ తెలిపారు. దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ పలువురు రచయితలు తమకు ప్రభుత్వం అందజేసిన పురస్కారాలు వెనుకకు ఇచ్చేస్తున్న తరుణంలో కిరణ్ ఖేర్ భర్త అనుపమ్ ఖేర్ వారికి వ్యతిరేకంగా గళం విప్పారు. దేశంలో అసహనం పెరగడం లేదని, ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, అవార్డులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని అనుపమ్ ఖేర్ గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ర్యాలీ నిర్వహించనున్నారని, ఇది సత్యానికి సంబంధించిన ర్యాలీ అని, మత అసహనానికి, ప్రధాని మోదీకి సంబంధం లేదని తెలియజెప్పేందుకే దీనిని అనుపమ్ ఖేర్ నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు.

More Telugu News