అధికారాన్ని ఇవ్వండి... బీహార్ రూపురేఖలు మారుస్తా: మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అధికారాన్ని ఇవ్వండి... బీహార్ రూపురేఖలు మారుస్తా: మోదీ

బీహార్ ఎన్నికల ప్రచారపర్వంలో ప్రధాని నరేంద్ర మోదీ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో విపక్షాలను తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారు. తాజాగా ఈ రోజు ముజఫర్ పూర్ లో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీలు బీహార్ ను నాశనం చేశాయంటూ ఆరోపించారు. బీహార్ ప్రజలు గత 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని తరిమికొడుతూనే ఉన్నారని అన్నారు. ఎన్డీయేకు అధికారాన్ని ఇస్తే... బీహార్ రూపు రేఖలు మారుస్తానని మోదీ చెప్పారు. గతంలో పేదవారు బ్యాంకుకు వెళ్లే పరిస్థితి లేదని... కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత 17 కోట్ల మంది పేదలతో బ్యాంకు ఖాతాలను తెరిపించామని చెప్పారు.

More Telugu News