ఏపీ మంత్రి ప్రత్తిపాటిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ 'అగ్రిగోల్డ్' బాధితులు
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై కేసు నమోదు చేయాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో నిన్న ఓ పిటిషన్ దాఖలైంది. తెలంగాణకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులు ఈ మేరకు పిటిషన్ ను దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తన భార్య పేరిట కారుచౌకగా మంత్రి ప్రత్తిపాటి కొనుగోలు చేశారని ఇప్పటికే విపక్ష వైసీపీ ఆరోపించింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి ప్రత్తిపాటి ఈ పిటిషన్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.