మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్

వచ్చేఏడాది ఫిబ్రవరి 14 నుంచి 21 వరకు జరగనున్న మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) జి.వి. రమణారావు వెల్లడించారు. కరీంనగర్ ఆర్టీసీ జోనల్ స్థాయి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఎండీ మాట్లాడుతూ, జాతర కోసం వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రీజియన్ల అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కరీంనగర్ జోన్ నుంచి 3605 బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. వరంగల్ రీజియన్ నుంచి 970 బస్సులు, కరీంనగర్ రీజియన్ నుంచి 640, ఖమ్మం రీజియన్ నుంచి 410, నిజామాబాద్ రీజియన్ నుంచి 225, ఆదిలాబాద్ రీజియన్ నుంచి 360 బస్సుల చొప్పున నడపనున్నట్లు వివరించారు. ఈమేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. గత ఏడాది మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడపటం ద్వారా రూ.21కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. అదే లక్ష్యంతో ఈసారి కూడా ముందుకెళ్తున్నామన్నారు. అలాగే సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు అధికారులందరూ అంకితభావంతో కృషిచేయాలని కోరారు.

More Telugu News