రైతులు భూసమీకరణకు సహకరించాలి... లేకుంటే సీఆర్డీఏ చట్టం కింద భూసేకరణ చేపడతాం: మంత్రి నారాయణ
రాజధాని అమరావతిలో ఇంకా 300 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రైతులు భూసమీకరణకు రావాలని సూచించామని, భూసమీకరణకు వారు ఒప్పుకోకపోతే 15 రోజుల్లో సీఆర్డీఏ చట్టం కింద భూసేకరణ చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. అందుకని రైతులే స్వచ్ఛందంగా భూసమీకరణకు సహకరించాలని కోరారు. ఈ మేరకు నెల్లూరులో నారాయణ మాట్లాడుతూ, 20వేల మంది ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి రావాల్సి ఉందన్నారు. చైనా తరహాలో అత్యాధునిక రీతిలో అమరావతిలో భవనాలను నిర్మించేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు.