2018 నాటికి పోలవరం పూర్తి: దేవినేని ఉమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఈరోజు ఆయన పోలవరం కుడికాల్వ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని విపక్షాలు అడ్డుకుంటున్నాయని... కావాలనే కోర్టులో పిటిషన్లు వేయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1500 క్యూసెక్కుల గోదావరి నీరు పట్టిసీమ నుంచి జక్కంపూడి మీదుగా కృష్ణానదిలో కలుస్తుందని చెప్పారు.