బీహార్ మూడో దశ పోలింగ్ 53.32 శాతం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీహార్ మూడో దశ పోలింగ్ 53.32 శాతం

బీహార్ లో మూడో దశ పోలింగ్ ముగిసింది. ఆరు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించగా, అందులో సమస్యాత్మకమైన 10 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన 40 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన పోలింగ్ లో కేవలం 53.32 శాతం ఓట్లు పోలైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 50 నియోజకవర్గాల్లో 808 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

More Telugu News