కేరళ భవన్ పై దాడిని ఖండిస్తున్నాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేరళ భవన్ పై దాడిని ఖండిస్తున్నాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఢిల్లీలోని కేరళ భవన్ లో గోమాంసం అమ్ముతున్నారంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే అక్కడ తనిఖీలు చేసిన ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. ఆ దాడిని ఖండిస్తున్నామని కరీంనగర్ లో చెప్పారు. లౌకిక దేశం భారత లో ఆహార అలవాట్ల పేరిట దాడులు సరికాదని చెప్పారు. కాగా, ప్రధాని మోదీ మెప్పుకోసమే సీఎం కేసీఆర్ చండీయాగం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఏలో చేరేందుకు కూడా ఆయన తహతహలాడుతున్నారని విమర్శించారు.

More Telugu News