మహిళా 'ఏఎస్ఐ'నూ వదలని చైన్ స్నాచర్లు
ఎంత నిఘా ఉంచినా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, పోలీసులు సైతం చైన్ స్నాచర్ల బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనే కోల్ కతా లో చోటు చేసుకుంది. ఏఎస్ఐగా పనిచేస్తున్న నిర్మలారాయ్ అనే మహిళ విధులు ముగించుకుని ఇంటికి తిరిగెళుతున్న సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నిర్మల మెడలో ఉన్న గోల్డ్ చైన్ ను లాక్కెళ్లారు. అయితే, స్థానికులే చైన్ స్నాచింగ్ కు పాల్పడి ఉంటారని... వారిని పట్టుకుని తీరతామని ఆమె తెలిపారు.