Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎల్బీ నగర్ ‘ఎస్ మార్ట్’లో భారీ చోరీ... వెనక గోడకు కన్నమేసిన దొంగలు

తెలుగు రాష్ట్రాల్లో చోరీల పరంపర కొనసాగుతోంది. నిన్నటిదాకా చైన్ స్నాచర్లు హడలెత్తిస్తే, తాజాగా ‘కన్నం’ దొంగలు బరి తెగించారు. మొన్నటికి మొన్న తిరుపతిలోని ‘లాట్ మొబైల్’ షట్టర్ ను బద్దలు కొట్టిన దొంగలు షోరూంలోని విలువైన మొబైల్స్ ను ఎత్తుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించి నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తాజాగా హైదరాబాదులోని ఎల్బీ నగర్ పరిధిలో నిన్న రాత్రి భారీ చోరీ జరిగింది. అక్కడి ఎస్ మార్ట్ ఎలక్ట్రానిక్ షోరూంలోకి చొరబడ్డ దొంగలు అందిన కాడికి ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించారు. షోరూం వెనుక గోడకు భారీ కన్నమేసిన దొంగలు గుట్టుచప్పుడు కాకుండా తమ పని ముగించుకునిపోయారు. నేటి ఉదయం షాపుకు వచ్చిన సిబ్బంది చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News