Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరంగల్ లో బీజేపీ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి లభిస్తుంది!: కిషన్ రెడ్డి ప్రకటన

వరంగల్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. వరంగల్ ఉప ఎన్నికలపై కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీలు ఉమ్మడిగానే ఈ బరిలోకి దిగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థి ఖరారు విషయంలో తమ రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న ఆయన తమ మధ్య మంచి అవగాహన ఉందన్నారు. వరంగల్ ఉప ఎన్నికలు అధికార టీఆర్ఎస్ కు రెఫరెండం లాంటివేనని ఆయన పేర్కొన్నారు.

More Telugu News