అరెస్టయిన కాసేపటికే విడుదలైన అమిత్ మిశ్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అరెస్టయిన కాసేపటికే విడుదలైన అమిత్ మిశ్రా

ఈ మధ్యాహ్నం బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా బెయిలుపై విడుదలయ్యాడు. తానున్న హోటల్ కు వచ్చిన యువతిని వేధించాడన్న ఆరోపణలపై మిశ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని విచారిస్తుండగానే, ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ పేపర్లతో రావడంతో పోలీసులు విడుదల చేయక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా, ఉదయం తమ విచారణకు వచ్చిన మిశ్రాను మూడు గంటలకు పైగా విచారించిన పోలీసులు ఘటనపై కీలక సమాచారాన్ని సేకరించినట్టు సమాచారం. ఆపై ఆయన్ను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ప్రకటించగా, ఆ వెంటనే లాయర్లు బెయిలుతో ప్రత్యక్షమయ్యారు. కాగా, కేసులో మిశ్రాపై ఐపీసీ సెక్షన్ 354తో పాటు 328 కింద కేసులు పెట్టినట్టు వివరించారు. ఇదిలావుండగా, బెయిలుపై విడుదలైనా, రేపు తమ విచారణకు రావాలని పోలీసులు సమన్లు జారీ చేశారు.

More Telugu News