తెలుగుదేశంపై లోకేశ్ మార్క్... రంగంలోకి యువనేత టీం!
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు యువనేత, పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా మంత్రుల కార్యాలయాల్లో లైజాన్ ఆఫీసర్లను తానే స్వయంగా ఏర్పాటు చేసుకున్న ఆయన, ఇప్పుడు జిల్లాల నెట్ వర్క్ ను పటిష్ఠం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే కొంతమందిని ఎంపిక చేసుకున్న ఆయన, పార్టీ పరిస్థితులను అధ్యయనం చేసే పనితో పాటు, నేతల కార్యకలాపాలపై నివేదికలు ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలు తీరు, వాటి గురించి ప్రజల్లో అవగాహన తదితరాలపైనా ఈ టీం సమీక్షలు జరుపుతుంది. వీరిచ్చే నివేదికల ఆధారంగానే భవిష్యత్తులో మంత్రి పదవులు, పార్టీ టికెట్ల పంపిణీ, నామినేటెడ్ పదవులు తదితరాలు ఆధారపడి వుంటాయని తెలుస్తోంది.