Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెషీన్ గన్స్, మోర్టార్లతో పాక్ దాడులు

పాకిస్థాన్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈరోజు కాల్పులు జరుపుతోంది. గతంలో ఉగ్రవాదులు చొరబడేందుకు మద్దతుగా కాల్పులు జరిపే పాక్ సైనికులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులకు దిగారు. మెషీన్ గన్స్, మోర్టార్లతో జరిపిన కాల్పుల ధాటికి సరిహద్దుల వెంబడి భారతీయుల దుకాణాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొందరు పౌరులు గాయపడగా, ఒకరు మృత్యువాతపడ్డారు. దీంతో సరిహద్దుల వెంబడి భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారత సైన్యం కూడా దీటుగా స్పందిస్తోంది.

More Telugu News