Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమరావతి కట్టాలా? వద్దా?: జగన్ కు గాలి సూటి ప్రశ్న

వైకాపా అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని అమరావతి నిర్మాణానికి జగన్ అనుక్షణం అడ్డు తగులుతున్నారని విమర్శించారు. అమరావతిని నిర్మించాలా? వద్దా? అనే విషయాన్ని జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగులు అమరావతికి రావాలా? వద్దా? అనే విషయంపై జగన్ స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఏపీకి పట్టిన సైతాన్ జగన్ అని గాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓ సైకోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News