హైదరాబాదులో ఉగ్రవాది ఖాజా అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో ఉగ్రవాది ఖాజా అరెస్ట్

హైదరాబాదులో మరో ఉగ్రవాది పోలీసులకు పట్టుబడ్డాడు. 2002లో గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్ల కేసులో కీలక నిందితుడైన ఉగ్రవాది ఖాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, మాటువేసి ఖాజాను పట్టుకున్నారు. నగరంలోని కుషాయిగూడలో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మన దేశంలో ఏ మూల ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నా... వాటికి పాల్పడిన ఉగ్రవాదులకు హైదరాబాదుతో సంబంధం ఉండటమో, లేక ఇక్కడ మకాం వేయడమో జరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశమే.

More Telugu News