టీఎస్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై పోలీస్ కంప్లైంట్... కేసు నమోదు చేయని పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఎస్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై పోలీస్ కంప్లైంట్... కేసు నమోదు చేయని పోలీసులు

తెలంగాణ దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై ఆదిలాబాదు జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందింది. విజయదశమి పర్వదినాన పిస్తోల్ ను గాల్లోకి లేపి కాల్పులు జరిపిన అల్లోల ఫొటోలను పలు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. వీటిని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాదు జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఇంద్రకరణ్ రెడ్డి చట్టానికి వ్యతిరేకంగా కాల్పులు ఎలా జరుపుతారని మహేశ్వరరెడ్డి నిన్న నిర్మల్ లో ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా గాల్లోకి కాల్పులు జరిపిన ఇంద్రకరణ్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. అయితే రెండు రోజులు గడుస్తున్నా, పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆయన వాపోయారు.

More Telugu News