Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పంజాబ్ పోలీస్ బాస్ పై వేటు

పంజాబ్ డీజీపీ సుమేథ్ సింగ్ సైనీపై వేటుపడింది. ఆయనకు పోలీస్ హౌజ్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పంజాబ్ హోం సెక్రటరీ తెలిపారు. పంజాబ్ లో గత కొన్నిరోజులుగా జరుగుతున్న సిక్కుల ఆందోళన నేపథ్యంలోనే సైనీపై వేటుపడినట్లు సమాచారం. కాగా, సైనీ స్థానంలో సురేశ్ అరోరాకు బాధ్యతలు అప్పగించారు. పంజాబ్ లో గతంలో తలెత్తిన ఉగ్రవాద సమస్యను పరిష్కరించడంలో ఆయన సమర్థమైన పాత్ర పోషించారు. అరోరా 1982 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. తమ మత గురువును అవమానించారనే కారణంతో చాలా రోజులుగా ఫరీద్ కోట్ లో సిక్కుల్లో ఓ వర్గం ఆందోళన చేస్తుండగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లింది. వీటిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారుల బదిలీలు జరిగినట్లు సమాచారం.

More Telugu News