ప్రేమ, సహనానికి మారుపేరు నా భార్య: షారుక్ ఖాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమ, సహనానికి మారుపేరు నా భార్య: షారుక్ ఖాన్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన భార్య గౌరీపై ప్రశంసల వర్షం కురిపించాడు. తమ పెళ్లి రోజు సందర్భంగా షారుక్ ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రేమ, సహనంతో బాటు, ఎన్ని అడ్డంకులెదురైనా లక్ష్యసాధన కోసం వెనుకాడనితనం వంటి గొప్ప లక్షణాలున్న నా భార్య గౌరీకి కృతఙ్ఞతలు. మా 24 సంవత్సరాల అనుబంధంలో నాకు ముగ్గురు పండంటి బిడ్డలను ఇచ్చింది’ అంటూ షారుక్ ఖాన్ ట్వీట్ చేశాడు. కాగా, ఎనిమిదేళ్ల ప్రేమ వ్యవహారం అనంతరం 1991లో షారుక్, గౌరీల వివాహం జరిగింది. షారుక్, గౌరీలకు ముగ్గురు పిల్లలు ఆర్యన్ (18), సుహానా(15), అబ్రమ్(2).

More Telugu News