గ్రామం మొత్తానికి విద్యుత్ ఉంది...కానీ బీహార్ సీఎం ఇంటికి మాత్రం లేదు... కారణం తెలుసా?
మౌలిక సదుపాయాల కల్పనలో బీహార్ వెనుకబడి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్టు సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసానికి విద్యుత్ సౌకర్యం లేదంటే నమ్మగలమా? కానీ అది నిజం. నితీష్ కుమార్ స్వస్థలం నలంద జిల్లాలోని కళ్యాన్ బిగా గ్రామం. ఆ గ్రామంలో నితీష్ కుమార్ సొంత ఇల్లు కట్టుకున్నారు. అప్పుడప్పుడు ఆ ఇంటికి వచ్చి ఆనందంగా గడిపి వెళ్తుంటారు. గతంలో ఆయన రాష్ట్రంలో ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వగలిగిన తరువాతే తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఆ మాట ప్రకారమే ఇప్పటికీ ఆ ఇంటికి విద్యుత్ కనెక్షన్ తీసుకోలేదు. అలాంటి నిబద్ధత గల నితీష్ కుమార్ మూడోసారి ముఖ్యమంత్రి కూడా అవుతారని ఆ గ్రామస్థులు భావిస్తున్నారు.