వన్డేల్లో ఆమ్లా సరికొత్త రికార్డు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వన్డేల్లో ఆమ్లా సరికొత్త రికార్డు

దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ ఆమ్లా వన్డేల్లో వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని అందుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. 126 మ్యాచ్ లలో 123 ఇన్నింగ్స్ ఆడి ఆమ్లా ఈ రికార్డు సృష్టించాడు. భారత్ తో జరుగుతున్న ఐదో వన్డేలో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆమ్లా 23 పరుగులు చేసి అవుటయ్యాడు. వ్యక్తిగత 15 పరుగులకు చేరుకోగానే 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇంతవరకూ విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు. కోహ్లి 144 మ్యాచుల్లో 136 ఇన్నింగ్స్ ఆడి 6 వేల పరుగులు పూర్తి చేశాడు. రిచర్డ్స్, గంగూలీ, డివిలియర్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పటివరకు 126 వన్డేలు ఆడిన ఆమ్లా 6008 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. 84 టెస్టులు ఆడి 23 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 6770 పరుగులు చేశాడు.

More Telugu News