ఏపీలో పెరిగిన ప్రీమియం మద్యం ధరలు...తగ్గిన బీరు, వైన్, చీప్ లిక్కర్ ధర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో పెరిగిన ప్రీమియం మద్యం ధరలు...తగ్గిన బీరు, వైన్, చీప్ లిక్కర్ ధర

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు పెరిగాయి. అదే సమయంలో చీప్ లిక్కర్ ధరలు తగ్గాయి. పెరిగిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ధరల పెంపుతో ఏడాదికి 200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుందని ప్రభుత్వం తెలిపింది. ప్రీమియం మద్యం ధరలు 25 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెరగగా, బీరు, వైన్ ధరలను తగ్గించింది. చీప్ లిక్కర్ పై 5 నుంచి 10 రూపాయలు తగ్గించింది. ఇందుకోసం జీవో నెంబర్ 394, 395 విడుదల చేసింది.

More Telugu News