చింతపల్లిలో అల్లు అర్జున్...అత్తారింటిలో ‘గన్నారెడ్డి’ డైలాగులతో సందడి చేసిన బన్నీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చింతపల్లిలో అల్లు అర్జున్...అత్తారింటిలో ‘గన్నారెడ్డి’ డైలాగులతో సందడి చేసిన బన్నీ

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిన్న నల్లగొండ జిల్లా చింతపల్లిలో సందడి చేశాడు. అయినా హైదరాబాదులో ఉండే బన్నీ చింతపల్లి ఎందుకెళ్లాడనేగా? మీ డౌటు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టిల్లు చింతపల్లి! సాధారణంగా పండుగలకు అల్లుళ్లంతా అత్తారిళ్లకు వెళ్లడం మనకు తెలిసిందేగా. అలాగే బన్నీ కూడా దసరా పండుగను పురస్కరించుకుని భార్యతో కలిసి తన అత్తారిల్లు అయిన చింతపల్లికి వెళ్లాడు. బన్నీ వస్తున్నాడని తెలుసుకున్న చింతపల్లి, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసిన బన్నీ, తాజా చిత్రం ‘రుద్రమదేవి’లో తాను పోషించిన ‘గోన గన్నారెడ్డి’ డైలాగులు చెప్పి వారిని అలరించాడు.

More Telugu News