అమరావతి విందు మెనూ ఇదే...
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమరావతి విందు మెనూ ఇదే...

అమరావతికి తరలి వచ్చిన అతిథులకు నోరూరించే వంటకాలు సిద్ధమయ్యాయి. మొత్తం మూడు కేటగిరీలుగా మెనూను సిద్ధం చేశారు. అతిథులకు పూర్తిగా ఆంధ్ర వంటకాలను రెడీ చేశారు. లక్షన్నర మందికి సరిపడా వంటకాలు అమరావతి శంకుస్థాపన వేదిక వద్ద సిద్ధంగా ఉన్నాయి. వీవీఐపీలకు శంకుస్థాపన జరిగే ప్రాంతంలోనే విందు ఏర్పాట్లు చేశారు. వీరికోసం గ్రీన్ సలాడ్, మొలకెత్తిన గింజలు, లెమన్ జ్యూస్, మొక్క జొన్న సలాడ్ అందుబాటులో ఉన్నాయి. భోజనంలోకి కొత్త ఆవకాయ, గోంగూర, వంకాయ పచ్చిపులుసు, కొబ్బరి చట్నీ, పచ్చి జామకాయ చట్నీ, కరివేపాకు కారం, కొబ్బరి శనగ కారం, మెంతి మజ్జిగ, రసం, అప్పడాలు, జిలేబీ, నేతి బొబ్బట్లు రెడీగా ఉన్నాయి. వీటితో పాటు రకరకాల కిళ్లీలు, నాలుగు రకాల ఐస్ క్రీమ్ లు ఉన్నాయి. వీవీఐపీలకు వేదికపైనే డ్రైఫ్రూట్స్ కార్న్ సమోసా, ఫ్రూట్ జ్యూస్, పూర్ణం అందిస్తారు. వీఐపీలకు 100 గ్రాముల చక్రపొంగలి, 150 గ్రాముల పులిహోర, ఒక గారె, ఒక పూర్ణం బూరె, ఒక ఫ్రూటీ, ఒక మంచినీళ్ల సీసా ఇస్తారు. రైతులు, సాధారణ ప్రజలకు 75 గ్రాముల చక్రపొంగలి, 150 గ్రాముల పులిహోర, 150 గ్రాముల దద్దోజనం, ఒక తాపేశ్వరం కాజా, ఒక అరటిపండు, రెండు మంచినీళ్ల సీసాలు ఇస్తారు.

More Telugu News