మూడు బస్సుల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ... భుజానికి బ్యాగ్ తో కొత్త లుక్ లో బాలయ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు బస్సుల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ... భుజానికి బ్యాగ్ తో కొత్త లుక్ లో బాలయ్య

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు దివంగత నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులంతా మూకుమ్మడిగా తరలివస్తున్నారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి విమానంలో బయలుదేరిన ఆ కుటుంబం కొద్దిసేపటి క్రితం విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో దిగింది. అక్కడి నుంచి మూడు బస్సుల్లో ఎక్కిన ఎన్టీఆర్ కుటుంబం అమరావతికి బయలుదేరింది. ఓ బస్సులో ఎక్కిన టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భుజానికి బ్యాగ్ తగిలించుకుని కొత్త లుక్ లో కనిపించారు. దారి పొడవునా ఆయన అభిమానులకు అభివాదం చేస్తూనే ముందుకు సాగారు.

More Telugu News