చంద్రబాబు సమక్షంలో జరుగుతున్న సర్వమత ప్రార్థనలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు సమక్షంలో జరుగుతున్న సర్వమత ప్రార్థనలు

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన కలశాల వద్ద సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. వివిధ మతాలకు చెందిన పెద్దలు తమ మత విధానాల ప్రకారం పూజలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం దిగ్విజయంగా జరగాలని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి ఆటంకాలు కలగరాదని ఈ సందర్భంగా ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, నారాయణ, పీతల సుజాత, తెలంగాణ ఎంపీ మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు.

More Telugu News