Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉబెర్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు... తుది తీర్పు వెలువరించిన కోర్టు

ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. గత ఏడాది డిసెంబర్ 5న రాత్రి సమయంలో 25 ఏళ్ల ఓ మహిళా ఎగ్జిక్యూటివ్ పై శివకుమార్ అత్యాచారం చేశాడని కోర్టు తుది తీర్పు వెలువరించింది. శివకుమార్ పై మోపిన అభియోగాలన్నీ కోర్టులో నిరూపితం అయ్యాయి. ఈ నెల 23న అతడికి కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఈ కేసుకు సంబంధించి 44 మంది సాక్షులను విచారించారు. 100 పేజీల చార్జ్ షీట్ ను దాఖలు చేశారు.

More Telugu News