Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిల్లర్ 'వీరప్పన్' భార్యపై కేసు నమోదు

గతంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించిన స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో వేలాది ఏనుగులను హతమార్చి వాటి దంతాలను, చందనం దుంగలను వీరప్పన్ స్మగ్లింగ్ చేశాడు. ఆ తర్వాత 2004లో ఎస్టీఎఫ్ బలగాల చేతిలో వీరప్పన్ హతమయ్యాడు. వీరప్పన్ మృతదేహాన్ని సేలం జిల్లాలోని కలత్తూరు సమీపంలోని మూలకాడులో ఖననం చేశారు. ఈ క్రమంలో గత ఆదివారం నాడు వీరప్పన్ 11వ సంస్మరణ దినం సందర్భంగా... మూలక్కాడు, మేచ్చేరిలో అనేక చోట్ల వీరప్పన్ పోస్టర్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండానే బ్యానర్లు ఏర్పాటు చేశారనే ఆరోపణలతో ముత్తులక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News