ప్రధాని ‘అమరావతి’ టూర్ ఎలాగంటే...!
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ప్రధానమంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ) నుంచి ఏపీ అధికారులకు సమాచారం చేరింది. విజయదశమి రోజున (ఈ నెల 22న) మధ్యాహ్నం 12.30 గంటలకు శంకుస్థాపన ప్రాంతానికి చేరుకునే మోదీ, 1.46 గంటల దాకా అక్కడే ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచే తిరుమల వెళ్లనున్న ఆయన సాయంత్రం 6.15 గంటలకు తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు. పీఎంఓ విడుదల చేసిన షెడ్యూల్ కింది విధంగా ఉంది.
మధ్యాహ్నం 12.30 : ప్రధాని శంకుస్థాపన ప్రాంతానికి చేరిక
12.30-35: అమరావతి గ్యాలరీ సందర్శన
12.35-43 : శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొంటారు
12.43-45 : ప్రధాన వేదిక మీదకు రాక
12.48-50 : ‘మా తెలుగుతల్లి’ గీతం ఆలాపన
12.50-53 : జపాన్ మంత్రి యోసుకే తకాగి ప్రసంగం
12.53-56 : సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం
12.56-1.01: వెంకయ్య నాయుడు ప్రసంగం
1.01-11 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం
1.11-43 : ప్రధాని మోదీ ప్రసంగం
1.43-46 : ప్రధానికి, అతిథులకు జ్ఞాపికల అందజేత
అనంతరం ప్రధాని తిరుపతి వెళ్తారు
3.30 - ప్రధాని తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
3.34-42 : ఫోటో గ్యాలరీ సందర్శన
3.43-45 : కొత్త టెర్మినల్ కు ప్రారంభోత్సవం
3.50: ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్ లో మొబైల్ కంపెనీల శంకుస్థాపనకు పయనం
4.00 :మొబైల్ కంపెనీలకు శంకుస్థాపన
4.15 : అక్కడ నుంచి తిరుమలకు పయనం
5.00 : తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్కు చేరిక
5.00 నుంచి 5.10 వరకు విశ్రాంతి
5.15 : శ్రీవారి ఆలయానికి రాక
5.15 నుంచి 6.00 వరకు శ్రీవారి సేవలో
6.00: దేవాలయం నుంచి పద్మావతి గెస్ట్ హౌస్కు చేరిక
6.15: తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు.