Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దసరా సందర్భంగా సికింద్రాబాద్ స్టేషన్ ఫ్లాట్ ఫాం టికెట్ ధర పెంపు

దసరా పండుగ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం టికెట్ ధర పెరిగింది. ప్రస్తుతం ఫ్లాట్ ఫాం టికెట్ ధర పది రూపాయలుగా ఉంది. ఇప్పుడది రూ.20కి పెంచారు. ఈ రోజు నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ఈ పెంపుదల అమల్లో ఉంటుంది. పండుగ సెలవుల సందర్భంగా రద్దీని నియంత్రించేందుకే టికెట్ ధర పెంచినట్టు చెబుతున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ నెల 21, 22 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

More Telugu News