సరికొత్త వైర్ లెస్ చార్జర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సరికొత్త వైర్ లెస్ చార్జర్

సరికొత్త వైర్ లెస్ చార్జర్ ను కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన సాంకేతిక పరిశోధకులు రూపొందించారు. ప్రస్తుతం మార్కెట్ లో లభ్యమవుతున్న చార్జర్లు ఒకే రకం ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రం చార్జింగ్ చేస్తాయి. ఈ సరికొత్త చార్జర్ ఏకకాలంలో ఏ రెండు ఎలక్ట్రానిక్ పరికరాల్లో నైనా సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. 200 కిలో హెర్ట్జ్ నుంచి 6.78 మెగా హెర్ట్జ్ వరకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలతో ఈ కొత్త చార్జర్ పనిచేస్తుంది. తక్కువ సమయంలో చార్జింగ్ చేసేలా దీనిని రూపొందించారు. ఇది రెండు స్మార్ట్ ఫోన్లంత పరిమాణంలో ఉంటుంది. సాధారణ వైర్ లెస్ చార్జింగ్ పరికరాల్లో అయితే ఒక ట్రాన్స్ మీటర్ కాయిల్ ఉంటుంది. కానీ, ఈ చార్జర్ లో 200 కిలో హెర్ట్జ్ నుంచి 6.78 మెగా హెర్ట్జ్ ఉండటం వల్ల, వేర్వేరు స్టాండర్డ్స్ లో ఉన్న పరికరాల్లోనూ కొత్త చార్జర్ సమర్థవంతంగా పనిచేస్తుంది.

More Telugu News