స్వచ్ఛ భారత్ కు కేజ్రీ తన పూర్తి మద్దతు తెలిపారు: చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వచ్ఛ భారత్ కు కేజ్రీ తన పూర్తి మద్దతు తెలిపారు: చంద్రబాబు

ఢిల్లీలోని ఏపీ భవన్ లో సీఎం చంద్రబాబును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. వారి భేటీలో స్వచ్ఛ భారత్ అంశంపై ప్రధానంగా చర్చించారు. స్వచ్ఛ భారత్ కు కేజ్రీవాల్ తన సంపూర్ణ మద్దతు తెలిపారని చంద్రబాబు మీడియాకు తెలిపారు. ఇదే సమయంలో ఈ నెల 22న జరిగే రాజధాని శంకుస్థాపనకు వారిని పిలిచామని, తప్పకుండా వస్తామని చెప్పారని వివరించారు. తరువాత కేజ్రీ మాట్లాడుతూ, చంద్రబాబుని కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. స్వచ్ఛ భారత్ కమిటీలో తానొక సభ్యుడినన్న ఢిల్లీ సీఎం, తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పినట్టు తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు తనను పిలిచినట్టు కేజ్రీ కూడా తెలిపారు. అదే రోజు నుంచి ఢిల్లీలో రెండు రోజుల పాటు తాము స్వచ్ఛ భారత్ చేపడుతున్నట్టు వెల్లడించారు. స్వచ్ఛ భారత్ పై నీతి అయోగ్ ఏర్పాటుచేసిన ఉప సంఘానికి కన్వీనర్ గా చంద్రబాబు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఢిల్లీలో జరగనున్న ఉపస్ంఘం సమావేశంలో ఆయన పాల్గొంటారు.

More Telugu News