రేపటి నుంచి దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపటి నుంచి దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

రేపటి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో అమ్మవారు తొలిరోజు దర్శనమీయనున్నారు. స్నపనాభిషేకం అనంతరం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం అవుతుంది. కాగా, రేపటి నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అమ్మవారికి దర్శనం విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతోంది.

More Telugu News