నేపాల్ నూతన ప్రధాని శర్మకు ప్రధాని మోదీ ఆహ్వానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేపాల్ నూతన ప్రధాని శర్మకు ప్రధాని మోదీ ఆహ్వానం

నేపాల్ నూతన ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్ లో పర్యటించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. నేపాల్ కొత్త రాజ్యాంగంపై వివాదం ముదరడంతో సుశీల్ కొయిరాలా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రధాని పదవికి నేపాల్ పార్లమెంటులో కొత్తగా ఎన్నికలు జరిగాయి. దీంతో శర్మ 89 ఓట్ల అధిక్యంతో విజయం సాధించి, నేపాల్ కొత్త ప్రధానిగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో ఆయన ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. కొత్త ప్రధానిగా ఎన్నికైన ఆయనకు రాజ్యాంగ మార్పు వివాదం స్వాగతం పలుకుతోంది. అలాగే వివిధ దేశాలతో ఉన్న సరిహద్దు వివాదం కూడా ఆయనకు తలనొప్పిగా మారే అవకాశం కనబడుతోంది. దేశ విదేశాల ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

More Telugu News