Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంద్ కు దూరంగా జానారెడ్డి... రుసరుసలాడుతున్న టీ కాంగ్ నేతలు

రైతు సమస్యలపై సర్కారు వైఖరికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా నేటి తెల్లవారుజాము నుంచే బంద్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని విపక్షాలు బంద్ లో పాలుపంచుకుంటున్నాయి. ఆయా పార్టీల కీలక నేతలందరూ నేటి ఉదయం తెల్లవారకముందే రోడ్లపైకి వచ్చారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్టాండ్ల ముందు ఆందోళనకు దిగిన ఆయా పార్టీల నేతలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం కూడా బంద్ ను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తెల్లవారకముందే పోలీసు బలగాలను రంగంలోకి దింపి విపక్ష నేతలను అరెస్ట్ చేయించింది. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీపీఐ కీలక నేత నారాయణ తదితరులంతా అరెస్టయ్యారు. అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జానారెడ్డి మాత్రం బంద్ లో ఎక్కడా కనిపించలేదు. విషయం తెలుసుకున్న పార్టీ నేతలు జానారెడ్డిపై రుసరుసలాడుతున్నారు.

More Telugu News