సిలికాన్ వ్యాలీని గెలిచిన మోదీ...భారత ప్రధానిపై అమెరికా మీడియా ఆసక్తికర కథనాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిలికాన్ వ్యాలీని గెలిచిన మోదీ...భారత ప్రధానిపై అమెరికా మీడియా ఆసక్తికర కథనాలు

అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై ఆ దేశ మీడియా ఆసక్తికర కథనాలు రాసింది. తనదైన మాటతీరు, సమ్మోహన ప్రసంగాలతో సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజాల మనసులను మోదీ గెలుచుకున్నారని ఆ దేశ పత్రికలు ప్రధాన శీర్షికలతో కథనాలు ప్రచురించాయి. అమెరికాలో అత్యంత ప్రజాదరణ కలిగిన పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ మరింతగా మోదీ పర్యటనను ఆకాశానికెత్తేసింది. ‘నరేంద్ర మోదీ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కాంకర్స్ సిలికాన్ వ్యాలీ’ పేరిట పతాక శీర్షికలో కథనాన్ని రాసింది. సిలికాన్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్ తదితర దిగ్గజ కంపెనీల అధిపతులతో మోదీ జరిపిన భేటీ, అక్కడి ఎన్నారైలను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగాలను ఈ కథనంలో ఆ పత్రిక ప్రధానంగా ప్రస్తావించింది. మోదీ ప్రసంగానికి ఎన్నారైల నుంచి వెల్లువెత్తిన స్పందనను కూడా ఆ పత్రిక ఆకాశానికెత్తేసింది. టెక్నాలజీకి కేంద్రంగా భారత్ ను తీర్చిదిద్దాలన్న తన లక్ష్యాన్ని మోదీ దాదాపు సాధించారని కూడా ఆ పత్రిక పేర్కొంది. ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు భారత్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అంగీకారం తెలపడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేసింది.

More Telugu News