: రూ. 13.8 లక్షల ప్రీమియం స్మార్ట్ ఫోన్... ఫీచర్లివే!
బిలియనీర్లకు, అత్యంత ధనవంతులకు దగ్గరైన హైఎండ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సంస్థ 'వర్చ్యూ' మరో మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'సిగ్నేచర్' పేరిట విడుదలైన ఈ ఫోన్ ధర ఎంచుకునే వేరియంట్ ను బట్టి భారత కరెన్సీలో రూ. 6.5 లక్షల నుంచి రూ. 13.8 లక్షల వరకూ ఉంటుంది. ఎనిమిది రకాల లెదర్ బాడీ వెరైటీలతో లభించే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ 4కే సఫైర్ క్రిస్టల్ స్క్రీన్, అత్యాధునిక 64 బిట్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్, 4జీబీ రామ్, 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 21 మెగాపిక్సెల్ ఫేస్ డిటెక్షన్ కెమెరా, డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియో, 4జీ, 5జీ తదితర సదుపాయాలతో లభిస్తుంది. ఈ ఫోన్ మెమొరీ సామర్థ్యాన్ని 2 టెరాబైట్ల వరకూ పెంచుకోవచ్చు. దీని బరువు 225 గ్రాముల నుంచి 236 గ్రాముల మధ్య ఉంటుంది.