Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

100, 220 కాదు, 310 మంది... క్షణక్షణానికీ పెరుగుతున్న మక్కా మృతులు

మక్కాలో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోంది. మృతుల సంఖ్య 500 దాటే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. తొలుత ఈ ఘటనలో 100 మంది చనిపోయారని, ఆ తరువాత 220 మంది చనిపోయారని ప్రకటించిన మక్కా ప్రభుత్వ అధికారులు ఇప్పుడు 310 మంది మృతి చెందారని లెక్కగట్టారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది తీవ్రగాయాలతో ఉన్నారని, కాలం గడిచేకొద్దీ వీరిలో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. వివిధ ఆసుపత్రులలో 800 మందికి పైగా చికిత్సలు పొందుతున్నారని, కనీసం 500 మందికి పైగా యాత్రికులకు అవయవాలు విరిగాయని తెలుస్తోంది. ఈ ఘటన తరువాత గంటపాటు సైతానును రాళ్లతో కొట్టే కార్యక్రమాన్ని నిలిపివేసిన సౌదీ ప్రభుత్వం, ఆ తరువాత లక్షల మంది యాత్రికుల సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని తిరిగి అనుమతించింది. హజ్ యాత్ర చివరి రోజున సైతానును 9 రాళ్లతో కొట్టిన తరువాత మాత్రమే యాత్ర పరిసమాప్తి అయినట్టు ముస్లిం సమాజం విశ్వసిస్తుందన్న సంగతి తెలిసిందే.

More Telugu News