Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగాయలంక మాజీ జడ్పీటీసీ హత్య కేసులో ఆరుగురికి జీవితకాల శిక్ష

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక జడ్పీటీసీ మాజీ సభ్యుడు కన్నా జనార్దనరావు హత్య కేసులో ఆరుగురికి జిల్లా అదనపు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి సుబ్రహ్మణ్యం తీర్పు వెలువరించారు. రాజకీయ కక్షల వల్లే ఈ హత్య జరిగిందని విచారణలో తేలింది. దాంతో నిందితులు సైకం శ్రీనివాసరావు, వడుగు శ్రీనివాసరావు, మోకా రాంబాబు, వాడపల్లి సూరిబాబు, సైకం చంటి, నడకూడిటి మురళీకృష్ణలకు జీవిత ఖైదు విధిస్తున్నట్టు జడ్జి ప్రకటించారు.

More Telugu News