ఇదో వింత... అక్కడ ఆడపిల్లలు మగపిల్లలైపోతారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇదో వింత... అక్కడ ఆడపిల్లలు మగపిల్లలైపోతారు!

ఆడపిల్ల..ఉన్నట్టుండి మగ పిల్లవాడైపోతే... ఇంకేముంది, కలకలమే కదా? అక్కడే అదే జరుగుతోంది. ఎందుకంటే, పుట్టే బిడ్డల్లో జన్యులోపం కారణంగా సహజసిద్ధంగానే జెండర్ మారిపోతోంది. దీంతో పిల్లల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్ లో ఈ వింత చోటుచేసుకుంటోంది. అక్కడ పుట్టిన ఆడపిల్లలకు 12 సంవత్సరాలు రాగానే మగపిల్లలుగా మారిపోతారు. ఎందుకట్లా జరుగుతోందంటే... బిడ్డ తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఎంజైమ్ లోపం కారణంగా మగబిడ్డగా పుట్టాల్సింది ఆడశిశువుగా పుడుతుంది. ఆడపిల్లగా పుట్టిన వారిలో డీ హైడ్రో టెస్టోస్టిరాన్ హర్మోన్ కారణంగా వారికి 12 సంవత్సరాల వయస్సు రాగానే మగపిల్లలైపోతారు. ఆడపిల్లలు మగపిల్లలుగా మారడాన్ని శాస్త్ర పరిభాషలో 'గెవెడాసెస్' అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఇక డొమెనిక్ రిపబ్లిక్ లో ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లలుగా మారుతున్నారనే విషయాని కొస్తే, ప్రతి 90 మందిలో ఒకరు ఇలా మారిపోతున్నారు. సాలినాస్ పట్టణంలో అయితే ప్రతి 90 మందిలో ఇద్దరు ఆడ శిశువులుగా పుట్టి తమ 12వ సంవత్సరంలో మగబిడ్డలుగా మారిపోతున్నారు. ఇటువంటి సంఘటన మొట్టమొదటిసారి 1970లో వెలుగుచూసిందని డాక్టర్ మైఖేల్ మోస్లే తెలిపారు.

More Telugu News