కాసేపట్లో అఖిల్ ఆడియో వేడుక... భారీగా తరలి వచ్చిన అభిమానులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాసేపట్లో అఖిల్ ఆడియో వేడుక... భారీగా తరలి వచ్చిన అభిమానులు

అక్కినేని ఫ్యామిలీ లేటెస్ట్ హీరో అఖిల్ హీరోగా రూపొందిన 'అఖిల్' సినిమా ఆడియో వేడుక మరికాసేపట్లో హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. మాటలు రాని వయసులోనే 'సిసింద్రీ'గా టాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన అఖిల్, 'మనం' సినిమాతో సరికొత్తగా అభిమానులను అలరించాడు. తాజాగా సోలో హీరోగా 'అఖిల్' సినిమాతో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు మరో నటుడు నితిన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ చిత్రంపై నిర్మాతగా నితిన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియో వేడుకను తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియంకి చేరుకున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ అతిరథ మహారథులు పాల్గొనున్నారు.

More Telugu News