ఆరుషి కేసులో సీబీఐ అధికారి తీవ్ర ఆరోపణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆరుషి కేసులో సీబీఐ అధికారి తీవ్ర ఆరోపణ

సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి ఏజీఎల్ కౌల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును మూసివేయాలంటూ తనపై సీనియర్లు ఒత్తిడి తెచ్చారని కోర్టుకు విన్నవించారు. 2008లో చోటు చేసుకున్న టీనేజర్ ఆరుషి, పనివాడు హేమరాజ్ జంట హత్యల కేసులో ఆమె తల్లిదండ్రులపై ఛార్జిషీటు నమోదు చేయాలని తాను కోరినా, సీబీఐ ఎస్పీ నీలభ్ కిశోర్, జేడీ జావేద్ అహ్మద్ లు కేసును ముందుకు కదలనీయలేదని కౌల్ వెల్లడించారు. కాగా, ఆరుషిని ఆమె తల్లిదండ్రులు నూపుర్, రాజేశ్ తల్వార్లే హత్య చేశారని కౌల్ ఇంతకుముందే కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన సమయంలో మూడో వ్యక్తి వారి ఇంట్లో ప్రవేశించే అవకాశం లేదని కౌల్ పేర్కొన్నారు.

More Telugu News