ప్రేమించి పెళ్లి చేసుకుంటే...వరసకు సోదరుడయ్యాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమించి పెళ్లి చేసుకుంటే...వరసకు సోదరుడయ్యాడు!

ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే, చివరికి అతను ఆమెకు వరసకు సోదరుడైన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. అవంబడికి చెందిన యువతికి ఓ వేడుకలో అస్ట్రాల్ కు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు యువతికి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. దీంతో, తన తల్లిదండ్రులు ప్రేమ వివాహాన్ని అంగీకరించరని భావించిన సదరు యువతి ఈ విషయం ప్రియుడికి చెప్పింది. 'సఖి' సినిమాలోలా పెద్దలకు తెలియకుండా వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఓ కుటుంబ వేడుకలో ఇద్దరూ తారసపడగా, వారిద్దరూ వరసకు అన్నా చెళ్లెళ్లు అవుతారని తెలిసింది. దీంతో అపచారం జరిగిపోయిందని భావించిన వారిద్దరూ సీక్రెట్ గా పోలీసులను కలిశారు. తమకు విడాకులు ఇప్పించాలని కోరారు. దీంతో వారి పరిస్థితి అర్థం చేసుకున్న మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలని నిర్ణయించారు.

More Telugu News