గాంధీ ఆసుపత్రిలో ఘోరం...విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్ పై రోగి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాంధీ ఆసుపత్రిలో ఘోరం...విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్ పై రోగి మృతి

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. ఆసుపత్రిలో గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనతో మృతుడి బంధువులు అక్కడ ఆందోళనకు దిగారు. అత్యవసర చికిత్స పొందుతున్న రోగుల విషయంలో ఆసుపత్రి అధికారులు ఈవిధంగా ప్రవర్తించడంపై మృతుడి బంధువులు మండిపడుతున్నారు. గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఆసుపత్రిలో ఎవ్వరూ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News