Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ద్వారకా తిరుమలలో చంద్రబాబు...‘తోటపల్లి’ని జాతికి అంకితం చేయనున్న ఏపీ సీఎం

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ‘చంద్రన్న యాత్ర’ పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చేరుకుంది. ద్వారకాతిరుమలలో వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడ కొత్తగా ఏర్పాటు కానున్న ఓ ఆసుపత్రికి ఆయన భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టుకు ఆయన చేరుకుంటారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రప్రథమంగా ప్రారంభించిన తోటపల్లి ప్రాజెక్టు 12 ఏళ్లకు పూర్తి అయ్యింది. ఈ ప్రాజెక్టును చంద్రబాబు నేడు జాతికి అంకితం చేయనున్నారు.

More Telugu News