గుంటూరులో నారా లోకేశ్ పర్యటన... పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుంటూరులో నారా లోకేశ్ పర్యటన... పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక భేటీ

టీడీపీ యువ నేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. నవ్యాంధ్ర రాజధాని పరిధిలో తన తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసానికి భార్య, కొడుకుతో కలిసి నిన్న వచ్చిన లోకేశ్ నేడు గుంటూరు నగర పర్యటనకు వెళుతున్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్ఠత, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితరాలపై ఆయన దృష్టి సారించనున్నట్లు సమాచారం.

More Telugu News