Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రాడ్ మన్ బ్లేజర్ కు ఊహించని ధర... రూ.61 లక్షలకు సొంతం చేసుకున్న అభిమాని

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు స్ఫూర్తిగా నిలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్ మన్ కు చెందిన ఓ బ్లేజర్ కు ఊహించని ధర లభించింది. 1936-37లో జరిగిన టెస్టు సిరీస్ లో ఆసీస్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బ్రాడ్ మన్ ధరించిన ఆ బ్లేజర్ ను ఆయన అభిమాని ఒకరు కళ్లు చెదిరే ధర చెల్లించి సొంతం చేసుకున్నారు. నిర్వాహకుల అంచనాలను తలకిందులు చేస్తూ బ్రాడ్ మన్ అభిమాని ఒకరు దానిని ఏకంగా రూ.61 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు.

More Telugu News